ఉద్యోగం పోయి.. సొంతూళ్లలో రైతులైనరు

ఉద్యోగం పోయి.. సొంతూళ్లలో రైతులైనరు

కరోనా వల్ల పోయిన జాబ్స్‌
తిరిగి పల్లెలకు చేరిన యువత

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: ఆశిష్‌‌ కుమార్‌‌ మహారాష్ట్రలోని బారామతిలో ఒక చాక్లెట్ ప్యాకింగ్‌‌ కంపెనీలో పనిచేసేవాడు. చాక్లెట్లను ఉంచే ప్లాస్టిక్ డబ్బాలను తయారు చేసేవాడు. చాలా మంది మాదిరే కరోనా వల్ల కుమార్‌ ‌జాబ్‌ కూడా ‌పోయింది. ఈ 20 ఏళ్ల యువకుడికి ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీలో డిప్లమా ఉంది. ఇక ముందు జాబ్‌ ‌చేయడానికి బదులు సొంతంగా ఏదైనా బిజినెస్‌ చేయాలన్నది కుమార్ ప్లాన్‌‌. కుమార్‌‌కు చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్‌ ‌వస్తువులు అంటే చాలా క్రేజ్‌‌ ఉండేది. అందుకే ప్లాస్టిక్‌ మౌల్డింగ్‌ ‌కోర్సును చదువుకున్నాడు. ప్లాస్టిక్‌ ‌ను రీసైకిల్‌ ‌చేసి రోజూ వాడుకునే వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ స్థాపించాలనేది ఆయన కల. కరోనా వచ్చాక పరిస్థితులు ఊహించనంతగా మారాయి. జాబ్‌‌ పోయింది. బ్యాంకు నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇది కేవలం కుమార్‌‌ ఒక్కడి దుస్థితే కాదు. కరోనా వల్ల లక్షలాది మంది వీధినపడ్డారు. చాలా చిన్న కంపెనీలు, బిజినెస్‌‌లు మూతపడ్డాయి. ఎకానమీ క్రైసిస్‌‌లోకి వెళ్లిపోయింది. లక్షలాది మంది కలలు కల్లలయ్యాయి. ఇలాంటి బాధితుల్లో అత్యధికులు వ్యవసాయాన్ని జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు.

పొలం పిలిచింది..
పట్టణాల్లో పరిస్థితి తలకిందులు అయినా, గ్రామాల్లో ఉన్న వాళ్ల పరిస్థితులు బాగానే ఉంటున్నాయని ఎకనమిస్టులు అంటున్నారు. వీరి ఆదాయాలు పెరుగుతున్నాయని, రోజుకు పది డాలర్లు (దాదాపు రూ.720) సంపాదించేవాళ్లూ ఉన్నారని చెబుతున్నారు. కరోనా వల్ల ఇండియా ఎకానమీ 4.5 శాతం తగ్గుతుందని, కనీసం 40 కోట్ల మంది వర్కర్లు పేదరికంలోకి వెళ్లిపోతారని ఐఎల్‌‌ఓ ప్రకటించింది. కుమార్‌ ‌తన రాష్ట్రంలోని చాలా ప్లాస్టిక్‌ కంపెనీల్లో పని కోసం ప్రయత్నించినా సక్సెస్‌ కాలేకపోయాడు.ఇప్పుడు తాను కుటుంబానికి భారంగా మారానని బాధపడుతున్నాడు. కరోనా కారణంగా కుమార్ నివసించే గోండా జిల్లాకు చెందిన 1.31 లక్షల మంది కరోనా వల్ల సొంతూళ్లకు వచ్చేశారు. వీరిలో కొందరు తిరిగి నగరాల్లో పనిచేసుకుంటున్నా, మరికొందరు ఊళ్లోనే సాగు పనులు చూసుకుంటున్నారు. చివరికి చేసేదేమీ లేక కుమార్‌‌ కూడా పొలంలోకి దిగాడు. ‘ ‘ఫెరెరో రోషర్‌‌ ప్రాలైన్‌‌ అనే ఖరీదైన చాక్లెట్లకు డబ్బాలు తయారు చేసే డ్రీమ్‌ ‌ప్లాస్ట్‌ కంపెనీలో పనిచేసేవాడిని. అక్కడ నాకు నెలకు రూ.13 వేలు ఇచ్చేవారు. పీఎఫ్‌‌, ఈఎస్‌‌ఐ వంటి అన్ని సదుపాయాలూ ఉండేవి. ఉచితంగా భోజనమూ పెట్టేవాళ్లు. కరోనా కారణంగా ఫ్యాక్టరీని మూసేస్తున్నట్టు మార్చిలో చెప్పారు. తరువాత చాలా కంపెనీల్లో జాబ్‌ ‌కోసం ప్రయత్నించాను కానీ దొరకలేదు. ఇటీవల ఫెరెరో నుంచి మెయిల్‌‌ వచ్చింది. జాబ్‌‌కు మళ్లీ రమ్మని పిలిచారు కానీ నేను వెళ్లే సాహసం చేయను. అక్కడి పరిశుభ్రత ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి వ్యవసాయం చూసుకుంటాను. ఏనాటికైనా నా‘ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీ’ కలను నిజం చేసుకుంటాను’’అనిచెప్పారాయన.

For More News..

ప్రపంచంలోనే హయ్యెస్ట్ టెంపరేచర్