రామ్ చరణ్ పై అవతార్ డైరెక్టర్ పొగడ్తలు: చిరంజీవి

రామ్ చరణ్ పై అవతార్ డైరెక్టర్ పొగడ్తలు: చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్  ప్రశంసలు కురిపించారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ఈ పొగడ్త రామ్ చరణ్ కు ఆస్కార్ కంటే తక్కువేం కాదని రిప్లై ఇచ్చారు. సినిమా రిలీజైన దగ్గర్నుంచి రోజుకో రికార్డుతో భారతీయ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్ మూవీని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మరోసారి కొనియాడారు. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రామ్ చరణ్ క్యారెక్టర్ పై పొగడ్తలతో ముంచెత్తారు. ఈ మూవీలో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదని, రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవమంటూ చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలని పోస్ట్ లో రాసుకొచ్చారు. దాంతో పాటు జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యల వీడియోను కూడా చిరంజీవి పంచుకున్నారు.