నవగ్రహాలు.. వాటి సంచారం.. అవి ఏ రాశిలో ఉన్నాయి.. అనే విషయాలపై వ్యక్తిగత జీవితం ఆధారపడి ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో రాహువుకు ఎంతో ప్రాధాన్యత ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. దీనినే ఛాయ గ్రహం అనికూడా అంటారు. ఎవరి జాతకంలో రాహువు బలహీనంగా ఉంటాడో వారు అనేక సమస్యలతో సతమతమవుతారని పండితులు చెబుతున్నారు. రాహువు బలహీనంగా ఉంటే ఎలాంటి సమస్యలు వాటి పరిష్కారానికి చేయాల్సిన పరిహారాలు ఏంటి మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్యంలో రాహువును క్రూరమైన గ్రహంగా అభివర్ణించారు. నల్లని మేని ఛాయ, ఎత్తయిన రూపం, నాలుగు భుజాలు కలిగి, కత్తి, త్రిశూలాన్ని ధరించి, కవచధారణ చేసి ఉంటాడు రాహువు. వాస్తు పరంగా కానీ, జాతకపరంగా కానీ అత్యంత ప్రమాదకరమైన గ్రహంగా రాహువును భావిస్తారు. రాహువు మనిషి జీవితం పైన, ఇంటి పైన కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. ఇంట్లోని అనేక భాగాలలో దోషాలు ఉంటే రాహువు తిష్ట వేస్తాడు. రకరకాల సమస్యలను ఇబ్బందులను కలిగించి, ఆ గృహస్థులను నాశనం చేస్తాడు
రాహువు వల్ల వచ్చే సమస్యలు
రాహువు సరైన స్థానంలో ఉండకపోతే వారు జీవితంలో ఆర్థిక పరమైన నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహువు ప్రభావంతో డిప్రెషన్, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి, గోళ్లు వికారంగా మారిపోవడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఇంకా కొత్తగా కొన్న ఫోన్కాని.. ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు సరిగా పనిచేయకపోయినా.. ఎలక్ట్రికల్ విషయంలో తరచూ ప్లోబ్లమ్ వస్తున్నా.. మిక్సీ.. గ్రైండర్ తరచూ రిపేర్ వస్తున్నా రాహువు చెడు ప్రభావం మీ ఇంటిపై ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రాహువుకు మురికి అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడ డర్టీగా ఉంది చెత్త.. చెదారం ఉంటుందో రాహువు అక్కడే ఉంటాడు. అయితే ప్రతి ఇంట్లో వాష్ రూం మురికిగా ఉంటుంది. అందుకే కచ్చితంగా రాహువు నివసిస్తాడు.
పరిష్కార మార్గాలు
వాష్ రూంను వారానికి ఒకసారి కచ్చితంగా క్లీన్ చేయాలి. వీలుంటే ప్రతి శనివారం బాత్రూంను శుభ్రం చేసుకుంటే రాహువు శాంతిస్తాడు. ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును నిండుపో నింపి దానిని బాత్రూంలో ఒక మూల ఉంచండి దీని వలన పరిసరాల్లోని ప్రతికూల శక్తిని తొలగిపోతుంది. ప్రతినెల శుద్ద పాడ్యమి రోజున దీనిని మార్చండి.
►ALSO READ | జ్యోతిష్యం: సమస్యలకు పూర్తి పరిష్కారం.. హనుమజ్జయంతి రోజున ఏ రాశి వారు ఏమి నైవేద్యం సమర్పించాలి..!
వాస్తు ప్రకారం బాత్రూంలో నీలి రంగు బకెట్.. నీలి రంగు మగ్ ను ఉంచండి. దీని వలన రాహువు.. శని గ్రహాల చెడు ప్రభావాలు తగ్గుతాయి. బాత్రూంలో కర్పూరం లేదా మంచి ఎయిర్ ప్రెషనర్ వాడండి. రాహువు ప్రభావం సువాసనతో తగ్గుతుంది.
వాష్ రూం ఇలా అస్సలు ఉండకూడదు..
బాత్రూంలో వాటర్ ట్యాప్లు లీక్ కాకూడదు.. అలా అయితే డబ్బు వృథా ఖర్చు అవుతుంది. తేమ లేకుండా ఉండాలి. బాత్రూంలో ఉండే బకెట్లో నీరు ఉండే విధంగా చూసుకోండి. అంటే ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉంటే అందులో నెగిటివ్ ఎనర్జీ తిష్ట వేస్తుంది. బాత్రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఉంచుకోండి.
పగిలిన గాజు ముక్కలు.. ఇతర చెత్తను ఎప్పటికప్పుడుతీసేయండి. మరో ముఖ్య విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ను బాత్రూంలోకి తీసుకెళ్తే రాహువు దోషం పెరుగుతుంది. కాబట్టి ఇంట్లోని రాహు సంబంధితమైన ప్రాంతాలలో వాస్తు దోషాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితం సర్వనాశనం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
