
హైదరాబాద్, వెలుగు : యూత్ ని అట్రాక్ట్ చేస్తూ కార్లలో, బైక్స్ పై కూర్చుని నచ్చిన ఫుడ్ తినే సేవలను అందిస్తోంది బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని కబరా డ్రైవ్ ఇన్. ఈ నయా ఫీచర్ ని సోమవారం మోడల్ మోనిసా, కబరా డ్రైవ్ ఇన్ డైరెక్టర్ అబ్దుల్లా ప్రారంభించారు. యూత్ ఎంజాయ్ చేసే వేరియస్ ఫుడ్ రెసిపీస్ తమ డ్రైవ్ ఇన్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్లలో, బైక్‌పై కూర్చున్న చోటుకే నోరూరిం చే ఫుడ్ ని తీసుకొచ్చి అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కొన్ని కార్లను ఏర్పాటు చేసి ఫుడ్ తిం టూ ఎంజాయ్ చేశారు. ఈ డ్రైవ్ ఇన్ లో తెలంగాణ ఫుడ్, మొగలాయి, చైనీస్ క్యూజిన్స్, వ్రాప్స్, పిజ్జాలు, షవర్మాలు, అరేబియన్ ఫుడ్, జ్యూసెస్, షేక్స్, ఐస్ క్రీమ్స్ రకాలు లభిస్తాయన్నారు.