
- వీడియోల కోసం రకరకాల స్టంట్లు
- 24 గంటలూ యువకుల ‘యాప్’ సోపాలు
- సెల్ఫీ పిచ్చి అప్ డేట్ అయ్యి వీడియోలుగా ట్రెండ్
హైదరాబాద్, వెలుగు:ఓ పార్టీలో ఇద్దరు స్నేహి తులు కలిశారు. మీ కూతురు ఏం చేస్తుందని అడగగా యాక్టర్ గా చేస్తుందన్నారు అందులోని ఒకరు. ఎందులోఅని అడగగా టిక్ టాక్ లో అని చెప్పాడు. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అవతలి వ్యక్తి ప్రశ్నించగా మా అబ్బాయి ఆర్మీలో చేస్తున్నాడనిసమాదానం వచ్చింది. ఓహ్ ఎక్కడా అని అడగ-గానే పబ్ జీలో అన్నడు నవ్వుతూ.. దీంతో ఇద్దరిపరిస్థితి ఒక్కటే అని వారికి అర్థమయ్యింది. ఇలా ప్రతి 10 కుటుంబాట్లో దాదాపు 6 ఇంటిలో ఇలాంటి యాప్ ల బాధితులు ఉంటూనే ఉన్నారు. ప్రస్తుతం టిక్ టాక్ కు ఎడిక్ట్ అయినవారి పరిస్థితి మరీ ఘోరంగా మారింది. స్మార్ట్ ఫోన్లలో ఫ్రంట్ కెమెరాలు స్టార్ట్ అవ్వగానే జనాలు సెల్ఫీలు తీసుకోవడం ఒక ట్రెండ్ గా ఫాలో అయ్యారు. ఆ తరువాత డబ్ స్మాష్ వీడియోలకు మారారు. ఇదే మాదిరి ప్రస్తుతం టిక్ టాక్ ట్రెండ్ నడుస్తుంది.జనాలు బాగా కనెక్ట్ అయిపోయి టిక్ టాక్ ను వ్యసనంగా మార్చుకున్నారు.
లైక్ లు రాకపోతే మనస్థాపం
టిక్ టాక్ వీడియోలు చేసేందుకు అలవాటుపడిన వారు ఎదుటివారికి వచ్చినన్ని లైక్ లు తమకు రాకపోవడంతో ఎంతో మనస్థాపానికి గురౌతున్నారు. తమ వీడియోలను ఎదుటివారితో పోల్చుకుంటూ లైకుల్లో పోటీ పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీడియోలు ఫన్నీ యాంగిల్ నుంచి సీరియస్ స్టేజ్ కు చేరాయి. లైక్ల కోసం ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది తమకు ఉన్న టాలెంట్ ను చూపించుకునేందుకు ఎక్స్ పర్ట్ ల ఆధ్వర్యం లోవీడియోలు చేస్తూ వాటిని టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తున్నారు. వాటికి ఎక్కువ లైక్ లు వస్తున్నాయి. వాటిని చూసిన మరి కొందరు తాము కూడా అలానే డేంజరస్ ఫీట్లు చేసి లైకులు తెచ్చుకోవాలని తపత్రయం పడుతున్నారు. డేంజరస్ ఫీట్లుట్రై చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈమధ్యనే ఓ యువకుడు సినిమా రేంజ్ లో స్టంట్ చేయబోయి మెడ విరగ్గొట్టుకు న్నాడు. ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల కిం ద మేడ్చల్ లో నర్సింహ అనే ఒక వ్యక్తి టిక్ టాక్ చేస్తుండగా చెరువులో పడిపోయి ఈత రాక చనిపోయాడు.మరోవైపు విద్యార్థులు, ఉద్యోగులు కూడా తమకు దొరికే కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వీడియోలు చేస్తున్నారు.
కేవలం సరదాగానే ఉండాలి
టిక్ టాక్ అనేది చిన్న సరదాగా మాత్రమే ఉండాలి.కానీ కొందరు మాత్రం లైకుల కోసం ఫీట్లు చేసి ప్రాణాలపైకి తెచ్చుకుంటు న్నాడు. తీవ్రమనస్తాపంతో ఒత్తిడికి గురౌతున్నారు. ఎంతపెద్ద రిస్క్ అయినా చేస్తున్నారు. ఇలాంటి వారినితిట్టకుం డా మెల్ల మెల్లగా నచ్చ జెప్పుతూ ఇతరవిషయాల్లో బిజీ అయ్యేలా చూడాలి. వాళ్లనుఒక్కసారి గా ఆపేందుకు ఫోర్స్ చేయొద్దు .-హరి రాఘవ్, మానసిక నిపుణుడు
లైకుల కంటే ప్రాణం ఇంపార్టెంట్
టిక్ టాక్ ను కేవలం యువత సరదాలకేవాడాలి. అతి వినియోగం మానసిక,శారీరక ఆరోగ్యంపై ప్రభావంచూపిస్తుంది. వీటి ద్వారా స్నేహితులు,కుటుంబానికి దూరమౌతున్నారు.వీడియోలు, లైక్ లు ప్రాణాలకంటేఎక్కువ కాదని యువత గుర్తించాలి.-సురేష్, ప్రభుత్వ ఉద్యోగి