కెరీరంతా ఒక్క కంపెనీలోనేనా?

కెరీరంతా ఒక్క కంపెనీలోనేనా?
  • అది ఓల్డ్‌‌ ఫ్యాషన్‌‌
  • ట్రెడిషనల్‌‌ రిటైర్మెంటా.. అబ్బే
  • పియర్సన్‌‌’ సర్వేలో ఇండియన్లు

కెరీరంతా ఒక్క కంపెనీలో పని చేయడం ఓల్డ్‌‌ ఫ్యాషన్‌‌ అంటున్నారు ఇండియన్లు. ‘ట్రెడిషనల్‌‌గా రిటైరవడమా ..అబ్బే’ అని పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ చేశాక రెండో ఇన్నింగ్స్‌‌ కూడా స్టార్ట్‌‌ చేస్తామంటున్నారు. పార్ట్‌‌టైం ఉద్యోగం చేస్తామని చెబుతున్నారు.

జాబ్స్‌‌, రిటైర్మెంట్‌‌పై ఇటీవల పియర్సన్‌‌ గ్లోబల్‌‌ చేసిన సర్వేలో మనోళ్లు తమ మనోగతాన్ని వెల్లడించారు. సర్వేలో 19 దేశాల్లోని 11 వేల మంది పాల్గొన్నారు. వీళ్లలో వెయ్యి మందికి పైగా ఇండియన్లు ఉన్నారు.

మనోళ్లలో సుమారు 75 శాతం మంది కంపెనీ మారతామని, 25 శాతం మంది రిటైరయ్యాక తమకిష్టమైన రంగంలో రెండో ఇన్నింగ్స్‌‌ మొదలుపెడతామని చెప్పారు. తాము అనుకున్న ప్రకారమే కెరీర్‌‌ను మొదలుపెట్టామని 84 శాతం మంది, ఒకసారి ఎంచుకున్నాక జాబ్‌‌ మారామని 31 శాతం మంది వెల్లడించారు. ప్రస్తుత టెక్నాలజీ వల్ల ఇప్పటి యువతరానికి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి సులువైందని, టెక్నాలజీతో ఎంజాయ్‌‌ కూడా చేస్తున్నాని 78 శాతం మంది జనం అభిప్రాయపడ్డారు. ఇప్పటి వాళ్లకు యూట్యూబ్‌‌ మొదటి లెర్నింగ్‌‌ టూల్‌‌గా ఉపయోగపడుతోందని, ప్రింట్‌‌ పుస్తకాల వాడకం తక్కువైపోయిందని, అంతా ఆన్‌‌లైన్‌‌, ఈ లెర్నింగేనని 79 శాతం మంది చెప్పారు.

ఫార్మల్‌‌ ఎడ్యుకేషన్‌‌ మంచిదని, కానీ అదేం అంత అవసరం లేదని 22 శాతం మంది జనం చెప్పారు. మరో 22 శాతం మంది ఆ ఎడ్యుకేషన్‌‌ ఇప్పటి తరానికి పనికిరాదని, ఆ చదువు లేకున్నా సక్సెస్‌‌ కావొచ్చని చెప్పారు. కాలేజీకి వెళ్లిన వాళ్లలో 39 శాతం మంది మరో చాన్స్‌‌ ఇస్తే బిజినెస్‌‌ చేసుకుంటామని, లేదంటే వొకేషనల్‌‌ ట్రైనింగ్‌‌ తీసుకుంటామని, కాలేజీకి మాత్రం పోమని చెప్పారు.

స్కూల్‌‌ చదువులు అయిపోయాక సక్కగా పనికి పోతామని 19 శాతం మంది అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఇప్పటి తరానికి బాగానే పనికొస్తుందని 59% మంది చెప్పారు.