
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణం రామవరానికి చెందిన సింగరేణి కార్మికుడు రఘు కొడుకు హేమసాగర్(28) హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. బుధవారం తన కారులో హైదరాబాద్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఒకసారి హేమసాగర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.