సెల్ఫోన్ ఎంత పనిచేసింది..క్షణాల్లో యువకుడి ప్రాణం తీసింది

సెల్ఫోన్ ఎంత పనిచేసింది..క్షణాల్లో యువకుడి ప్రాణం తీసింది

Tragic Incident: కారు అతివేగం క్షణాల్లో ఓ యువకుడి ప్రాణాన్ని గాల్లో కలిపింది. రాత్రిపూట రోడ్డు దాటుతున్న యువకుడిని కారు అతివేగంగా ఢీకొట్టింది.ఎంత వేగం అంటే..అతడి బాడీ గాల్లోకి ఎగిరి..తిరిగి కారు పడి మరోసారి గాల్లోకి ఎగిరింది.కారు స్పీడ్కు యువకుడి బాడీ వీధిచివర ఎగిరిపడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఒళ్లుగుగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ లో రికార్డయింది.

హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా ఉప్పర్ బరోట్కు చెందిన నరేష్ కుమార్.. నెర్ చౌక్ లోకి ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. నెర్ చౌక్ చౌరస్తాలో ఈ విషాద ఘటనలో మృతిచెందాడు. 

సమాచారం అందుకున్న వెంటనే స్పాట్ కు చేరుకున్న బాల్హ్ పోలీస్ స్టేషన్ పోలీసులు.. నిందితుడు కారు డ్రైవర్ రాకేష్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. 
 
అయితే నరేష్ కుమార్ మృతికి కారు వేగంగా నడపడమే కారణమని..దురదృష్టవశాత్తు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అతని ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అతని ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు లో తేల్చారు. 

స్థానిక మీడియా ప్రకారం.. నిందితుడు కారు డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు మండి ఎస్పీ తెలిపారు.నరేష్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.