V6 News

ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక : యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి...

ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక : యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి...
  • మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్​ ప్రతిమాసింగ్​, ఎస్పీ శ్రీనివాస రావు

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​జిల్లాను బాలల భద్రత, రక్షణ సంక్షేమంపై అగ్రగామిగా నిలిచేలా కృషి చేయాలని కలెక్టర్​ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మెదక్​ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్​ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే యువతకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఎగ్జిబిషన్​ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ బాలల భద్రతపై, మత్తు పదార్థాల నివారణపై జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు.  

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.  తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలికలకు స్పోర్ట్స్​కిట్స్​పంపిణీ చేశారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుహాసినిరెడ్డి, డీడబ్ల్యూవో హేమభార్గవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్టీసీ డీఎం సురేఖ, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జీవో సునీత, తదితరులు పాల్గొన్నారు.