నా లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావని.. యువకుడి గొంతు కోసిన మరో యువకుడు

 నా లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావని.. యువకుడి గొంతు కోసిన మరో యువకుడు

కూకట్​పల్లి, వెలుగు: నా లవర్​తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఓ యువకుడితో గొడవ పడిన మరో యువకుడు బ్లేడ్​తో అతని గొంతు కోసి పరారయ్యాడు. కూకట్​పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటకు చెందిన బోస్ అలియాస్​భాస్కర్, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి బ్రేకప్​అయ్యారు. తర్వాత జనతానగర్​కు చెందిన బతవల్ బర్దన్ తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రతీ ఆదివారం చర్చి వద్ద కలిసి మాట్లాడుకోవడం భాస్కర్​చూస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం చర్చి నుంచి బయటకు వచ్చిన బర్దన్​తో అతను గొడవ పడ్డాడు. 

తన లవర్​తో ఎందుకు మాట్లాడుతున్నావని ఘర్షణ పడ్డాడు. అనంతరం క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న బ్లేడ్​తో బర్దన్​గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని అక్కడున్నవారు ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.