జితేందర్ రెడ్డి మూవీ నుండి యూత్‌‌ఫుల్ లిరికల్ సాంగ్‌‌ విడుదల

జితేందర్ రెడ్డి మూవీ నుండి యూత్‌‌ఫుల్ లిరికల్ సాంగ్‌‌ విడుదల

రాకేష్ వర్రె హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర పాత్రలు పోషించారు.  మే 3న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అ ఆ ఇ ఈ ఉ ఊ’ అంటూ సాగే యూత్‌‌ఫుల్ లిరికల్ సాంగ్‌‌ను విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘ఆర్ట్స్ సైన్స్ ఇంగ్లీష్ కంటే ముందుగా.. తెలుసుకోరా జరిగేదేంటో ఎనక ముందరా.. బుక్స్ మొత్తం బట్టీ పట్టి బుక్‌‌ అయిపోకురా..’ అంటూ రాంబాబు గోశాల క్యాచీ లిరిక్స్ రాశాడు. ఇందులో రాకేష్ వర్రె స్టూడెంట్ లీడర్‌‌‌‌గా కనిపిస్తున్నాడు.