అనుకున్నడు సాధించిండు  

అనుకున్నడు సాధించిండు  

బలమైన కోరిక, సాధించాలనే తపన ఉంటే ఏనాటికైనా సక్సెస్‌‌‌‌‌‌‌‌ దక్కుతుంది. ఇది యూట్యూబర్ ఆశిష్ చంచ్లాని జీవితంలో నిజమైంది. సక్సెస్‌‌‌‌‌‌‌‌ కోసం అతను నిజాయితీగా కష్టపడి పని చేశాడంతే.. ఆ కష్టమే అతన్ని నిలబెట్టింది. ఆ కష్టం వల్లే కొన్ని లక్షలమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్నాడు. 

మహారాష్ట్రకు చెందిన ఆశిష్ చంచ్లాని 1993లో పుట్టాడు. సివిల్‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కానీ.. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక వల్లే ఓ కంపెనీలో నెల జీతానికి పనిచేయాల్సిన ఆశిష్‌‌‌‌‌‌‌‌ ప్రతి నెలా లక్షల్లో సంపాదించగలుగుతున్నాడు. ఆయనకు నచ్చిన రంగంలోనే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేసుకున్నాడు. మంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌తో డబ్బు కూడా జనరేట్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నాడు. ఆశిష్‌‌‌‌‌‌‌‌ చదువుకునే రోజుల నుంచే సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండేవాడు. తల్లిదండ్రులు దీపా, అనిల్‌‌‌‌‌‌‌‌ చంచ్లానిలకు ముంబైలో మల్టిప్లెక్స్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. అందులోనే సినిమాలు చూస్తూ పెరిగాడు ఆశిష్‌‌‌‌‌‌‌‌. ఎక్కువగా సినిమాలు చూడడం వల్ల యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ మీద ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌ కలిగింది. చదువుకునే టైం నుంచే మంచి యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని కలలు కనేవాడు. స్కూల్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు తన యాక్టింగ్‌‌‌‌‌‌‌‌, మైమింగ్ టాలెంట్‌‌‌‌‌‌‌‌తో యాక్టర్స్‌‌‌‌‌‌‌‌ని, పొలిటీషియన్స్‌‌‌‌‌‌‌‌ని ఇమిటేట్‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. కాలేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు తన లెక్చరర్లు, ఫ్రెండ్స్ మెచ్చుకుని.. ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యే నాటికి ఆశిష్‌‌‌‌‌‌‌‌కు భవిష్యత్తుపై ఒక క్లారిటీ వచ్చింది. యాక్టింగ్‌‌‌‌‌‌‌‌నే కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంచుకోవాలి అనుకున్నాడు. కానీ.. అందరు తల్లిదండ్రుల్లాగే అతని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ కూడా భయపడ్డారు. సినిమా రంగంలో సక్సెస్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు వస్తుందో లేదో కూడా కచ్చితంగా చెప్పలేం. అందుకే వాళ్లు ఆశిష్‌‌‌‌‌‌‌‌ యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లడాన్ని ఒప్పుకోలేదు. దాంతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఇంజనీరింగ్ చేశాడు. కానీ.. తన యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పూర్తిగా పక్కన పెట్టలేదు. కాకపోతే.. కాస్త గ్యాప్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. 
 

ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌లో 
ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ చదివేటప్పుడు తనకు యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ మీదున్న ఇష్టాన్ని వదల్లేదు. యాక్టింగ్‌‌‌‌‌‌‌‌, ఇమిటేటింగ్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ని బాగా డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనను తాను బాగా నమ్మాడు. అందుకే చదువుకుంటున్నప్పుడే బ్యారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో చేరాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫుల్‌‌‌‌‌‌‌‌గా లీనమయ్యాడు. 2009లో యూట్యూబ్ ఛానెల్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కానీ.. 2014 వరకు ఒక్క వీడియో కూడా పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. 
 

ప్రొఫెషనల్ అరంగేట్రం
ఆశిష్​ ‘‘ఆశిష్ చంచ్లానీ వైన్స్” పేరుతో ఛానెల్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసి, వీడియోలు పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. తక్కువ టైంలోనే సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అతను స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ దాటగానే యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగు పెట్టడం వల్ల ఎక్కువగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ కష్టాలు, డిమాండ్‌‌‌‌‌‌‌‌లపై వీడియోలు చేశాడు. దాంతో కొన్ని రోజుల్లోనే ఫేమస్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లాంటి ఎంతోమంది యాక్టర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించాడు. 
 

కలలు సాకారం ఇలా.. 
యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ వీడియోల ద్వారా ఆశిష్‌‌‌‌‌‌‌‌కు సినిమా, సీరియల్స్‌‌‌‌‌‌‌‌లో అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఆయనకు యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో 27.3 మిలియన్ల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. 2016లో ‘ప్యార్ తునే క్యా కియా’తో టీవీ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ దాదాపు 29 కోట్ల రూపాయలు. అంతేకాదు యాడ్‌‌‌‌‌‌‌‌సెన్స్‌‌‌‌‌‌‌‌, ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా నెలకు దాదాపు 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. 

యూట్యూబ్ వీడియోలకు టైం సరిపోవట్లేదని చదువు మానేశాడు. యూట్యూబ్​కంటే ముందు ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్ స్టేటస్​లలో కూడా పెట్టేవాడు. ఒక్కో వీడియో కంప్లీట్​ చేయడానికి రెండు వారాలు పడుతుందని ఒక ఇంటర్వ్వూలో చెప్పాడు ఆశిష్​. షాహిద్ కపూర్ భార్య మీరా.. ఆశిష్​కు​ ఫ్యాన్. ఆమె చెప్పడం వల్లే ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందట. అక్షయ్​కుమార్​ అంటే చాలా ఇష్టం . ఎప్పటికైనా ఆయన్ని కలుస్తా అని ఫ్రెండ్స్​తో చెప్పేవాడు. యూట్యూబ్​లో ఫేమస్​ అయ్యాక నిజంగానే అక్షయ్​ని కలిసే ఛాన్స్​ వచ్చింది. అదొక అచీవ్​మెంట్ మాత్రమే కాదు, తనని కూడా అక్షయ్​ గుర్తుపట్టడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్​ అయ్యాడట.  ‘ప్యార్ తునే క్యా కియా’ అనే టీవీ సిరీస్​లో ఫస్ట్ టైం యాక్ట్ చేసే ఛాన్స్​ ఆశిష్​కి వచ్చింది.