యూట్యూబర్ :​ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లోప్రాంక్​..తెగ వైరల్

యూట్యూబర్ :​ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లోప్రాంక్​..తెగ వైరల్

లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఒక చిన్న పాప చీర కట్టుకుని నిల్చుంటుంది. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినవాళ్లంతా ఆమె కాళ్లు మొక్కుతుంటారు. కానీ.. ఒకావిడ మాత్రం విచిత్రంగా చూస్తుంది.ఈ వీడియో చూస్తున్న వాళ్లందరికీ అది ప్రాంక్​ అని తెలుసు. కానీ.. ఆవిడకు మాత్రం ఆ విషయం తెలియక ఆశ్చర్యపోతుంది. ఇలాంటి లిఫ్ట్ ప్రాంక్​ వీడియోలు కొన్నాళ్లనుంచి బాగా వైరల్​ అవుతున్నాయి. వాటిలో ఎక్కువ వీడియోలు చేసింది ఇండియాలో టాప్​ రేడియో జాకీల్లో ఒకరైన ఆర్జే నవేద్​. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ప్రాంక్​ వీడియోలు చేసి అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. 

నవేద్​ ఫేమస్​ రేడియో జాకీ, యాడ్​ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. రేడియో ప్రోగ్రామ్స్​ని కూడా హోస్ట్ చేస్తుంటాడు. రేడియో మిర్చి 98.3 ఎఫ్​ఎంలో వచ్చే ‘ఢిల్లీ కా డాన్​’ చాలా ఫేమస్​. నవేద్​ ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో పుట్టాడు. గవర్నమెంట్​ స్కూల్​లో చదువుకున్నాడు. అతని అసలు పేరు నవేద్ సిద్ధిఖీ. యాక్టింగ్, పెయింటింగ్, కామెడీ అంటే ఇష్టం నవేద్​కు.  

కాల్​ సెంటర్​లో పనిచేసి.. 

చదువు పూర్తి కాగానే.. సొంతూరిని విడిచిపెట్టి ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లాడు. ఎయిర్​టెల్‌‌‌‌‌‌‌‌ కాల్​సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్’గా ఉద్యోగంలో చేరాడు. కస్టమర్‌‌‌‌‌‌‌‌కు ఏదైనా విషయంపై బాగా కోపం వచ్చినప్పుడు, అలాంటి ఫోన్​ కాల్స్​ని నవేద్​కు ట్రాన్స్​ఫర్​​ చేసేవాళ్లు. అంటే ఎంతటి గట్టి కస్టమర్​ని అయినా తన మాటలతో కూల్​ చేసేవాడన్నమాట!

జాకీగా ప్రయాణం.. 

నవేద్​ రేడియో మిర్చి 2004లో నిర్వహించిన ఆర్జే హంట్‌‌‌‌‌‌‌‌ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో 3,000 మందికి పైగా పాల్గొన్నారు. అందులో నవేద్​ది మొదటి స్థానం. అప్పటి నుంచి రేడియో మిర్చిలో ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. ‘డాక్టర్ లవ్’ అనే నైట్ షోతో ఆర్జేగా కెరీర్​ మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే రేడియో మిర్చిలో ‘టోటల్ ఫిల్మీ’ అనే పేరుతో నడుస్తున్న మరో షోకి మారాడు. తర్వాత 2007 నుంచి అతను ‘బంపర్ టు బంపర్’ అని పిలిచే ‘సన్‌‌‌‌‌‌‌‌సెట్ సమోసా’ షోని హోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కొన్నేళ్లుగా అతని షోల్లో అనేక కొత్త అంశాలను పరిచయం చేశాడు.- అంతేకాదు.. మూడుసార్లు ‘బెస్ట్ స్పార్కిల్’ అవార్డు, 2015వ సంవత్సరంలో గోల్డెన్ మైక్‌‌‌‌‌‌‌‌లో “బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆర్జే” అవార్డు గెలుచుకున్నాడు. 

యూట్యూబ్​లోకి ఎంట్రీ

సక్సెస్​ఫుల్​ ఆర్జేగా కొనసాగుతూనే 2020 డిసెంబర్​లో యూట్యూబ్ ఛానెల్​ మొదలుపెట్టాడు. ఇందులో ముఖ్యంగా జనాలను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రాంక్​ వీడియోలు చేస్తున్నాడు. నవేద్​ చేసిన లిఫ్ట్‌‌‌‌‌‌‌‌  ప్రాంక్​ వీడియోలు చాలా పాపులర్​ అయ్యాయి. ఈ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్​ వస్తుంటాయి. ఒక షాపింగ్​ మాల్​లోని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి తన టీంతో కలిసి ప్రాంక్​ చేస్తాడు. అంతేకాదు.. ఫోన్​ కాల్స్​ చేసి రకరకాల ప్రాంక్స్​ చేస్తుంటాడు. ఆ వీడియోలను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తాడు. ప్రస్తుతం ఛానెల్​కు 1.71 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. 
రేడియో మిర్చీలో వచ్చే ‘మిర్చీ ముర్గా’ అనే ప్రోగ్రాంతో ప్రాంక్స్​ చేస్తూ జనాలను నవ్విస్తున్నాడు. ఈ వీడియోలను కూడా ‘మిర్చీ ముర్గా’ అనే యూట్యూబ్​ ఛానెల్‌‌‌‌‌‌‌‌లో అప్​లోడ్​ చేస్తున్నారు. నవేద్​ ట్వింకిల్ ఖన్నా, విద్యాబాలన్​తో పాటు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్​ మీద కూడా ప్రాంక్స్​ చేశాడు. నవ్వించడమే కాదు.. సొసైటీ పట్ల బాధ్యతగా కూడా ఉంటాడు నవేద్​. దేశంలో జరుగుతున్న ఈవ్​టీజింగ్, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, వివక్ష, మత కల్లోలాలు, పొలిటికల్​ వార్స్​, ఆకలి చావులు.. వంటి సున్నితమైన​ అంశాల మీద కూడా తన గొంతు వినిపిస్తున్నాడు.

కపిల్​ శర్మ షో

ఫిబ్రవరి 2017లో అతను తన షోలు చేయడం ఆపేశాడు. దాదాపు ఆర్నెల్లు గ్యాప్​ తీసుకున్నాడు. తర్వాత కపిల్ శర్మ షోకి వెళ్లడం ద్వారా టెలివిజన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఏప్రిల్ 2017లో ఇండియాస్ బెస్ట్ జాబ్స్ షో కోసం డిస్కవరీ (ఇండియా)లో ఒక ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ తర్వాత ఆయనకు సోషల్​ మీడియాలో చాలా గుర్తింపు వచ్చింది. ఫేస్​బుక్​కు 8.4 మిలియన్ల ఫాలోవర్స్​ ఉన్నారు. విదేశాల్లో కూడా ఈయనకు ఫ్యాన్స్​ ఉన్నారు. ఒకసారి దుబాయి​కి వెళ్లినప్పుడు ఇండియన్స్​తోపాటు పాకిస్తాన్​ వాళ్లు కూడా ఇతనితో ఫొటోలు దిగారు. ఆ విషయాన్ని ఒక షోలో తనే చెప్పాడు.