కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట తూతూమంత్రంగా కట్టారు: సింహాచలం ప్రమాదంపై జగన్ కామెంట్స్

కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట తూతూమంత్రంగా కట్టారు: సింహాచలం ప్రమాదంపై జగన్ కామెంట్స్

సింహాచలం ప్రమాద బాధితులను పరామర్శించారు వైసీపీ అధినేత జగన్.. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. చందనోత్సవానికి ముందే ఎందుకు గోడ కట్టలేదని ప్రశ్నించారు. ఏ రోజుల కిందట పూర్తైన గోడ పక్కన క్యూ లైన్ ఎలా పెట్టారని ప్రశ్నించారు జగన్.కాంక్రీట్ తో గోడ కట్టాల్సిన చోట ఫ్లైయాష్ బ్రిక్స్ తో గోడ ఎలా కడతారని ప్రశ్నించారు జగన్ ఈ ఘటనకు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలీదా.. ఏటా చందనోత్సవం సమయంలో వర్షం పడుతుందని తెలీదా అని ప్రశ్నించారు. ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు జగన్.

ఈ ఘటన పట్ల చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి ప్రజలు చనిపోయారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని.. కడప కాశినాయన క్షేత్రంలో బుల్డోజర్లతో సత్రాన్ని కూల్చారని.. తిరుమల గోశాలలో ఆవులు మరణించాయని.. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయాయని.. ఈ ఘటనలు అన్నిటిలో చంద్రబాబే దోషి అని అన్నారు.

కాంక్రీట్ తో గోడ కట్టాల్సిన చోట ఫ్లైయాష్ బ్రిక్స్ తో గోడ ఎలా కడతారని ప్రశ్నించారు జగన్. గోడ నిర్మానికి కనీసం టెండర్లు కూడా పిలవలేదని అన్నారు. బాధితులను ఆదుకుంటామని..బాధితులను తాము ఆదుకునేలోపే ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు జగన్.