కడప క్వారీ పేలుడు ఘటనలో ప్రతాప్ రెడ్డి అరెస్ట్

కడప క్వారీ పేలుడు ఘటనలో ప్రతాప్ రెడ్డి అరెస్ట్

కడప: కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాళ్ల క్వారీ (గనుల్లో) పేలుడు ఘటనలో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు  అరెస్టు చేశారు. పేలుడు సామగ్రి నిర్వహణ, రవాణా లో నిబంధనలు ఉల్లంఘన, పేలుడు పదార్థాలను తరలించడంలో నిబంధనలు అతిక్రమించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఇప్పటికే ఘటనలో భాద్యులైన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా వైఎస్ ప్రతాపరెడ్డిని అరెస్టు చేశారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా పేలుడు సామగ్రి తరలించారని ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కడప సిట్టింగ్ ఎంపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సన్నిహితుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రతాప్ రెడ్డి పెద్దనాన్న అవుతారు. ఈయన పులివెందులతోపాటు సింహాద్రిపురం, లింగాల తదితర ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తున్నారు.