కేసీఆర్ పై షర్మిల ఫైర్.. అయ్య పెట్టడు..అడుక్కు తిననియ్యడు

V6 Velugu Posted on May 11, 2021

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి విషయంలో కేబినెట్ సమావేశం అనంతరం లాక్డౌన్ నిర్ణయం ప్రకటించడంపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు .. కేంద్ర ఆయుష్మాన్ భారత్ లో చేరరు. అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పటల్స్ కు దోచిపెడుతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ హాస్పిటల్స్ లో వసతులు ఉండవు  .. సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉంది.. హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడుతానన్న దానికి మోక్షం లేదు.. ప్రజల ఆరోగ్యానికి సరిపోను బడ్జెట్ ఇచ్చెదిలేదు.,ఉస్మానియా..  గాంధీ, నిమ్స్ .. టిమ్స్ ఆస్పత్రులకే ఊపిరి సక్కగా అందుతలేదు, ఇక అందులో చేరినవారి ఊపిరి గాలిలొ దీపం..కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా వైద్యానికి  ..  రేటు ఎక్కువ, జనం కరోనా నుండి బతికి బయటపడితెే.. అప్పులతో చచ్చేటట్టుంది.. KCR సారు .. సోయిలకురా.  ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి,  కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చు అంటూ వైఎస్ షర్మిళ ట్విట్టర్ వేదికగా కోరారు. 

 

Tagged Telangana today, Telangana LockDown, , ys sharmila comments, ys sharmila tweets, sharmila angry, sharmila reaction, ts cabinet decessions

Latest Videos

Subscribe Now

More News