కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఎటు చూసినా స‌మ‌స్య‌లే

V6 Velugu Posted on Oct 28, 2021

ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా, వైఎస్ఆర్ సంక్షేమ పాలన తెలంగాణలో మళ్లీ తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల మొదలుపెట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ, వారికి భరోసా కల్పిస్తూ ఆమె పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తోంది. పాదయాత్ర 100 కిలోమీటర్లను చేరుకున్న సందర్భంగా షర్మిల.. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రజలనుద్ధేశించి మాట్లాడనున్నారు.

‘100 కి.మీ.ల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూశాను. టీఆర్ఎస్ అవినీతి, నియంత పాలనలో జనం కంట‌త‌డి పెడుతున్నారు. రైతుల గోసలు ఎన్ని చెప్పినా తరగవు. మహిళల బాధలు వర్ణణాతీతం. వృద్ధులు 60 ఏండ్ల‌లోనూ కూలీనాలీ చేసుకోవాల్సిన ప‌రిస్థితి.

యువ‌త ఉద్యోగాలు లేక త‌లెత్తుకోలేక‌పోతున్నారు. విద్యార్థులు ఉన్న‌త చ‌దువుల‌కు దూర‌మ‌య్యారు. ప్ర‌జ‌ల‌కు మంచి నీళ్లు కూడా క‌రువ‌య్యాయి. నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. కార్మికుల‌కు ఉపాధి క‌రువైంది. రోడ్లు అధ్వానంగా మారాయి. ఇండ్లు కూలిపోతున్నాయి.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఎటు చూసినా స‌మ‌స్య‌లే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్, వాటిని మ‌రచి పాల‌న సాగిస్తున్నాడు. రుణ‌మాఫీ, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేవు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదు. కార్పొరేష‌న్ లోన్లు లేవు. చేతి వృత్తుల‌కు చేయూత లేదు.

ఉచిత విద్య‌, వైద్యం వ‌దిలి బ‌ర్లు, గొర్లు అంట‌గ‌డుతుండు. దొర పాల‌న‌లో ప్ర‌జ‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌డం లేదు. జ‌నం YSR పాలన మ‌ళ్లీ రావాల‌ని కోరుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో, వారి ఆశ‌యాల‌కు అనుగుణంగా YSR సంక్షేమ పాలన మ‌ళ్లీ తీసుకొస్తాం’ అని షర్మిల అన్నారు.

For More News..

వృద్ధులకు ఫ్రీ మీల్స్.. మిగతావారికి రూ. 5లకే ఫుల్ మీల్స్

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ

హుజూరాబాద్ లో డబ్బుల పంపిణీ లొల్లి

Tagged Telangana, CM KCR, YS Sharmila, Ibrahimpatnam, Sharmila Padayatra, Praja Prasthanam

Latest Videos

Subscribe Now

More News