
పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతి పట్ల వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ ప్రీతి తుది శ్వాస విడవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిన్ని ప్రార్థించారు.ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్ మేరకు వెంటనే విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయని వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 5 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి అదివారం రాత్రి చనిపోయింది. ప్రీతి బ్రెయిన్ పని చేయడం పూర్తిగా ఆగిపోయిందని ఆదివారం మధ్యాహ్నమే కుటుంబ సభ్యులకు నిమ్స్ డాక్టర్లు తెలియజేశారు. ప్రీతి మృతదేహన్ని ఆమె స్వస్థాలనికి చేర్చారు. ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి.