వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. ఇంటి ముందు బలగాల మోహరింపు

వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. ఇంటి ముందు బలగాల మోహరింపు

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న షర్మిల.. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆందోళన జరగకుండా ఉదయం నుంచి ఆమె ఇంటి దగ్గర పోలీసు బలగాల్ని మోహరించారు. తర్వాత హౌజ్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు. 

ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలో షర్మిల ధర్నా చేపడితే పరిణామాలు ఉద్రిక్తంగా మారే అవకాశముంది. అందుకే ముందస్తుగా పోలీసులు షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. స్టూడెంట్ యూనియన్లు, ఇతర పార్టీ నేతలు టీఎస్పీఎస్సీ నిర్వాకానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన షర్మిల సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే పేపర్ లీక్ లు జరుగుతున్నాయని ఆరోపించారు.