కాళేశ్వరం అవినీతిపై మౌనమెందుకు? : షర్మిల

కాళేశ్వరం అవినీతిపై మౌనమెందుకు? : షర్మిల

హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా కాళేశ్వరం అవినీతిపై చర్చ జరుగుతుంటే  కేంద్రం విచారణకు ఎందుకు వెనకాడుతోందని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వస్తున్నా, ప్రాజెక్ట్ వైఫల్యాలపై తెలంగాణ సమాజం ఆందోళన చేస్తున్నా.. మౌనంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రధానికి షర్మిల లేఖ రాశారు. తన జేబులు నింపుకోవడానికి, తన కుటుంబ నికర సంపదను పెంచుకోవడానికి కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారని విమర్శించారు. ఎన్నికల్లో  కేసీఆర్​ను గద్దె దించే చాన్స్​ మరో పార్టీకి వచ్చిందని, ఆ పార్టీని బలోపేతం చేయకుండా, పోటీకి దిగి ఓట్లు చీల్చితే.. మళ్లీ కేసీఆర్ గద్దెనెక్కే ప్రమాదం ఉందని చెప్పారు.