దళితులకు జరిగిన అన్యాయం గుర్తుకురాలేదా?

దళితులకు జరిగిన అన్యాయం గుర్తుకురాలేదా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలకు దిగారు. దళితులపై మీద కేసీఆర్ లేనిప్రేమను నటిస్తున్నారని ఆమె చెప్పారు. ఎన్నికల కోసమే దళితబంధు పెట్టి అమలు చేయనప్పుడు.. వారికి జరుగుతున్న అన్యాయం గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. రాజ్యాంగంతో దళితుల జనాభాకు తగ్గట్లుగా న్యాయం చేయలేకపోతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసినప్పుడు.. తమ ఆధీనంలో ఉన్న SC & ST సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించినపుడు దళితులకు జరిగిన అన్యాయం గుర్తుకురాలేదా అని క్వశ్చన్ చేశారు. 

‘మీరు దళితులకు చేసిన మోసాలు కనపడకూడదని, దళితుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కొత్త రాజ్యాంగం కావాలని నీతులు చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చుడు కాదు.. ఉన్న రాజ్యాంగంలో దళితుల హక్కులు అమలు చెయ్యండి. దళితులపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి’ అని షర్మిల ట్వీట్ చేశారు. ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగమన్నా ఖర్చు చేయలే’ పేరుతో వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని ట్వీట్ కు జత చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు

సెబీ నూతన ఛైర్మన్‌గా మాధవీ పురీ