కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలె 

కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలె 

హైదరాబాద్: కరోనా రోగులకు ఫ్రీగా వైద్యం అందేలా చూడాలని వైఎస్పార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర కేటగిరీలో చేరుస్తూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయంపై షర్మిల స్పందించారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆమె ఫైర్ అయ్యారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, అందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని.. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా అందేలా చూడాలని కోరారు. 

గతంలో కరోనాతో నష్టపోయిన కుటుంబాలకు వైద్య బిల్లులు చెల్లించాలని షర్మిల చెప్పారు. సెకండ్ వేవ్ సమయంలో డాక్టర్లు, బెడ్స్ లేక జనాలు పిట్టల్లా రాలిపోతుంటే కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని, ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడైనా జనాల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం: 

డాలర్ శేషాద్రి ప్రస్థానం.. ప్రశంసలు, వివాదాలు

మనసున్న శ్రీమంతుడు

షాపులొచ్చిన సంబురం.. తప్పని వార్నింగ్‌లు