మంత్రి ఎర్రబెల్లిపై షర్మిల సెటైర్లు

మంత్రి ఎర్రబెల్లిపై షర్మిల సెటైర్లు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత ఊరు పర్వతగిరిని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. పర్వతగిరి మండల కేంద్రంలో పాదయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడారు.  జిల్లాలో ఒక్క పంచాయతీ కూడా అభివృద్ధి చెందలేదు..ఆయనో మంత్రా? అంటూ ఎర్రబెల్లిపై సెటైర్లు వేశారు.  పర్వతగిరిలో ఒక్క డిగ్రీ, ఇంటర్ కాలేజీ కూడా  లేదన్నారు. నిధులడిగితే ఖాళీ బీరు సీసాలు, బ్రాందీ సీసాలు అమ్ముకుని పంచాయతీ నడుపుకోమ్మంటడని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిధులివ్వదు కేంద్రం నుంచి  వచ్చే నిధులు దక్కనివ్వదని విమర్శించారు.

అంతకు ముందు  షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓ కాంట్రాక్టర్ అని షర్మిల వ్యాఖ్యానించడంతో  బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన షర్మిల ప్లెక్సీలను చించేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ కార్యకర్తల ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.