
గచ్చిబౌలి, వెలుగు : తనను చంపుతామంటూ సోషల్ మీడియాలో కొందరు బెదిరిస్తున్నారని.. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని వైఎస్ సునీతా రెడ్డి శుక్రవారం సైబరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.
సునీతా రెడ్డిని చంపుతామంటూ కొందరు వ్యక్తులు ఫేస్ బుక్‌లో పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి డీసీపీ తెలిపారు. ఫిర్యాదును స్వీకరించామని.. దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.