
తన ఓటు తొలగించాలని ఎవరో దరఖాస్తు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వైఎస్సార్సీపీ చీఫ్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ఏపీలో ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపుపై వ్యూహరచన జరిగిందని, 50 లక్షల ఓట్లు తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఓట్లు తొలగించడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టాలన్నారు. వివేకానందరెడ్డి ఓటు తొలగించాలంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం తహశీల్దార్ ఆఫీస్ కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. దీనిపై స్థానికంగా కలకలం రేగింది.