ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసభ్యకర కామెంట్స్ చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు, పవన్ ను రాయలేని భాషతో తిట్టారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబును తిట్టాలని ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ లేవకుండా చంద్రబాబును కొట్టాలనుందన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని.. చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే పవన్.. ఒక నాయకుడేనా అని అన్నారు. చంద్రబాబు,లోకేష్,పవన్ ను జైల్లో పెట్టాలన్నారు.
ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఫిర్యాదు
అసభ్యకర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి పై టీడీపీ నేతలు కాకినాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు,పవన్ లపై కామెంట్స్ చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు వారికి రశీదు ఇచ్చారు.
