
ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం(Vyuham). ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేశారు. ఈ మూవీ నుంచి రీసెంట్గా వెన్ను పోటు సాంగ్ అంటూ..పులుల రూపంలో గుంట నక్కలు అంటూ సాంగ్ రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేశారు వర్మ.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి మరో సాంగ్ను రిలీజ్ చేయబోతున్నారు. ఆస్కార్ నాటు నాటు వండర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చేత పాడిస్తున్నఈ సాంగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వర్మ. వైఎస్సార్సీపీ..వైఎస్సార్సీపీ (YSRCP)..ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు..దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు..ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు..సీమ సింగంలా తొడగొట్టే చూడు..ఊరు ఊరంతా ఉండాలి తోడు..అంటూ ఉన్న ఈ పాటతో మరో సంచలనానికి రెడీ అయ్యారు వర్మ. త్వరలో ఈ సాంగ్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఏపీ ఎలక్షన్స్ సమయంలో రిలీజ్ చేస్తానని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు.
వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణన్ నటిస్తుంది. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
The one and only @Rahulsipligunj singing a song for VYOOHAM ??? pic.twitter.com/m3C99kkdB4
— Ram Gopal Varma (@RGVzoomin) September 20, 2023