మునుగోడు బైపోల్​తో పాలన కుంటుపడింది: షర్మిల

మునుగోడు బైపోల్​తో పాలన కుంటుపడింది: షర్మిల

జగిత్యాల, వెలుగు: రాష్ట్రం ఏర్పాటు తర్వాత లబ్ధి పొందింది కల్వకుంట్ల కుటుంబం, టీఆర్ఎస్ నేతలేనని వైఎస్ఆర్టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను సీఎం కేసీఆర్ దోచుకున్నారని ఆమె విమర్శించారు. ఆమె పాదయాత్ర మంగళవారం మేడిపల్లి మీదుగా మల్యాల మండలం రాంపూర్ నుంచి జగిత్యాల వరకు సాగింది. పాదయాత్ర అనంతరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్​లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడారు.

మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్రంలో పాలన కుంటుపడిందన్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆనఖకు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. కాళేశ్వరం పేరు చెప్పి రూ.70 వేల కోట్లు కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే కంటి వైద్య నిపుణుడైన డాక్టర్ సంజయ్ కుమార్​కు నియోజకవర్గ ప్రజల సమస్యలు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక  పెన్షన్ 3 వేలకు పెంచడంతోపాటు  అర్హులైన పేద మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.