ఫైనల్ ​స్టేజ్లో షర్మిల పార్టీ విలీన చర్చలు

ఫైనల్ ​స్టేజ్లో షర్మిల పార్టీ విలీన చర్చలు

కాంగ్రెస్​లో షర్మిల పార్టీ విలీనం చర్చలు తుది దశకు వచ్చాయి. తాజాగా సోనియా, రాహుల్​తో ఆమె ఢిల్లీలో మీటింగ్ తర్వాత షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చేశారన్న ప్రచారముంది. పాలేరు సీటు గురించి షర్మిల పట్టుబట్టినా, కాంగ్రెస్​ అందుకు రెడీగా లేదని తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ హోదాతో పాటు రాజ్యసభ సీటిస్తామని చెప్పినట్టు సమాచారం. 

విలీన చర్చల సమయంలో సికింద్రాబాద్ బరిలో ఉండాలని చెప్పినట్టు ప్రచారం జరిగినా, చివరకు  ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభ సీటు, స్టార్​ క్యాంపెయినర్ పదవి, ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతల అప్పగింత లాంటి అంశాలపైనే డిస్కషన్స్​ జరిగాయని తెలుస్తున్నది. కాగా, షర్మిల రెండేండ్లుగా పాలేరులో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.