లంచాలు, కమీషన్లు తప్ప కేసీఆర్ కు మరేం పట్టవు

లంచాలు, కమీషన్లు తప్ప కేసీఆర్ కు మరేం పట్టవు

సూర్యాపేట: కేసీఆర్ కు లంచాలు, కమీషన్లు తీసుకోవడం తప్ప మరొకటి తెలియదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర 104వ రోజుకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా  బరాకత్ గూడెం నుంచి 104వ రోజు పాదయాత్రను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ప్రాజెక్ట్ ల పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని షర్మిల పిలుపునిచ్చారు. అక్మచిల్కూర్ మండలం పోలేని గూడెం, బేతవోలు, చెన్నారి గూడెం గ్రామాల మీదుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ షర్మిల యాత్ర కొనసాగిస్తున్నారు. సాయంత్రం మునగాల మండలం గణపవరం గ్రామస్థులతో ఆమె మాట ముచ్చట నిర్వహించనున్నారు.