కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ యుగానికి అతడే అత్యుత్తమ క్రికెటర్: యువరాజ్ సింగ్

కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ యుగానికి అతడే అత్యుత్తమ క్రికెటర్: యువరాజ్ సింగ్

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ ముందు భారత యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌పై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. గిల్ ఎదుగుదలను నిశితంగా చూస్తున్నానన్న యువరాజ్, అతను చిన్ననాటి నుండి కష్టపడాల్సిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ కష్టపడుతున్నాడని తెలిపాడు.

గిల్‌ 19-20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడన్న యువరాజ్.. అతను ఇలానే కొనసాగిస్తే ఈ తరంలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉంది అని తెలిపాడు. రాబోయే మెగా ఐసీసీ ఈవెంట్‌లో భారత్‌కు గేమ్‌చేంజర్‌గా మారగల సామర్థ్యం గిల్‌కు ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సంధర్బంగా గిల్ తన తొలి టెస్టు పర్యటన(ఆస్ట్రేలియా)లో చారిత్రాత్మక విజయానికి పునాది వేసిన గబ్బా ఇన్నింగ్స్ 91 పరుగుల నాక్‌ను గుర్తు చేసుకున్నాడు.

"గిల్ గబ్బా టెస్టులో 91 పరుగులు చేశాడు. మొదటి పర్యటన(ఆస్ట్రేలియా)లోనే రెండు అర్ధశతకాలు సాధించాడు. ఇలా ఎంత మంది ఆటగాళ్లు రాణించారో నాకు తెలియదు. కానీ అతను మాత్రం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లండ్‌ గడ్డపై కూడా రాణించగలడని  నేను ఖచ్చితంగా నమ్ముతున్నా.." అని యువరాజ్ వెల్లడించాడు.

Also Read :- పాకిస్తాన్‌ను ఓడించి.. గోల్డ్ మెడల్ సాధించిన భారత్

23 ఏళ్ల శుభ్‌మాన్ గిల్‌ ఈ ఏడాది గిల్ ఈ ఏడాది 20 మ్యాచ్ ల్లో 1230 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో సహా చారిత్రాత్మక డబుల్ సెంచరీ కూడా ఉంది. అంతేకాదు, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతానికి 847 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(857) పాయింట్లతో నెంబర్.1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.