Asian Games 2023: పాకిస్తాన్‌ను ఓడించి.. గోల్డ్ మెడల్ సాధించిన భారత్

Asian Games 2023: పాకిస్తాన్‌ను ఓడించి.. గోల్డ్ మెడల్ సాధించిన భారత్

ఆసియా క్రీడ‌ల్లో భారత్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణ ప‌త‌కం చేరింది. పురుషుల ఈవెంట్‌ స్క్వాష్‌ ఫైనల్‌లో సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేష్ మంగోంకర్‌లతో కూడిన భారత స్క్వాష్ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది.

మొదట భారత స్క్వాష్ జట్టు 0-1తో వెనుకబడినప్పటికీ.. ఆ తరువాత పుంజుకొని 2-1తేడాతో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. మరోవైపు శనివారం జరిగిన టెన్నిస్ ఈవెంట్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో బొప‌న్న జోడి స్వర్ణం సాధించింది. రెండో సీడ్‌గా బ‌రిలోకి దిగిన బొప‌న్న‌-భోస్లే జోడి తొలి సెట్‌ ఓడినా.. ఆ త‌ర్వాత అద్భుతమైన పోరాటపటిమతో ఆక‌ట్టుకున్నారు. తైపికి చెందిన సుంత్ హో హువాంగ్‌, ఇన్ షౌ లియాంగ్ జంట‌పై   2-6, 6-3, 10-4 తేడాతో గెలుపొందారు.

కాగా, ఆసియా కీడల్లో భారత్ ఇప్పటివరకూ 36 పతకాలు సాధించగా.. అందులో (10 గోల్డ్),  సిల్వర్(13), బ్రాంజ్(13) ఉన్నాయి.