అంబానీ కొడుకు పెళ్ళిలో చాహల్.. కొరియోగ్రాఫర్‌తో ధనశ్రీ పోజులు

అంబానీ కొడుకు పెళ్ళిలో చాహల్..  కొరియోగ్రాఫర్‌తో ధనశ్రీ పోజులు

భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం IPL 2024 రాబోయే 17వ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే చాహల్ భార్య ధన్‌శ్రీ వర్మకు సంబంధించిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఇటీవల ముగిసిన సోనీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పోటీదారుగా పాల్గొంది. ఇందులో ధన్‌శ్రీ వర్మ కూడా ఫైనల్ కంటెస్టెంట్‌గా కనిపించింది. నిజానికి ఈ ఫోటోలో ధన్‌శ్రీ తన కొరియోగ్రాఫర్ తో కలిసి దిగిన ఫోటోను చూసి.. సోషల్ మీడియాలో చాహల్, ధనిశ్రీ జంటను యూజర్లు ట్రోల్ చేస్తున్నారు.

రియాల్టీ షో ఝలక్ దిఖ్లా జా ఫైనల్ కూడా ముగిసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ధనశ్రీవర్మ షేర్ చేసిన ఫోటో ప్రతిచోటా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ధనశ్రీ వర్మ, ప్రతీక్ ఉటర్కర్ ఇద్దరూ కూడా బ్లాక్ డ్రెస్ లో కనిపించారు. చాహల్ భార్య ధన్‌శ్రీని వెనుక నుంచి ప్రతీక్ ఉటర్కర్ కౌగిలించుకుంటున్నాడు. క్రికెట్ అభిమానులు, చాహల్ ఫాలోవర్స్ బీభత్సంగా ఈ పిక్ ను ట్రోల్ చేస్తున్నారు.

ధన్‌శ్రీ ఇదివరకు టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో డ్యాన్స్ వేసిన ఫోటోలున్నాయి. అయ్యర్ ,ధన్‌శ్రీ మధ్య ఉన్నఫ్రెండ్ షిప్ గురించి చాలా సందేహాలు తెరపైకి వచ్చాయి. కానీ అయ్యర్ , చాహల్ కుటుంబం మధ్య మంచి స్నేహం ఉండటంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. ప్రస్తుతం చాహల్ టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తన పేరును తొలగించింది. అయితే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.