
- రూ.20.80 కోట్లు విలువ చేసే హెరాయిన్‌తో పట్టివేత
- విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్ట్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో జాంబియా దేశస్తురాలికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది.10 ఏండ్ల జైలు శిక్ష తో పాటు రూ.లక్ష జరిమానా చెల్లించాలని మంగళవారం తీర్పును వెలువరించింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 2021 జులై 19న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదా చేయగా జాంబియా నుంచి వచ్చిన మహిళ వద్ద 3200 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ.20.80 కోట్లు. మహిళను అరెస్ట్ చేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తాజాగా ఆమెకు కోర్టు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.