జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతల సాయం కోరిన జెలెన్స్కీ

జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతల సాయం కోరిన జెలెన్స్కీ

ఉక్రెయిన్ సిటీ మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ఫెదొరోవ్‌ను రష్యన్ బలగాలు కిడ్నాప్ చేశాయని, ఆయనను విడిపించేందుకు సాయపడాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ... జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతలను కోరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. రష్యా దురాక్రమణను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని తాము చర్చించామని జెలెన్స్కీ తెలిపారు. తమ దేశ పౌరులపై దాడులు చేసి, సామాన్యుల ప్రాణాలు తీస్తూ రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా మాట్లాడుకున్నామని చెప్పారు. మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ను రష్యన్ బలగాల చెర నుంచి విడిపించేందుకు సాయం చేయాలని ఈ రెండు దేశాధినేతలను కోరినట్లు తెలిపారు. అంతా కలిసికట్టుగా రష్యా దురాక్రమణను అడ్డుకోవాలని జెలెన్స్కీ అన్నారు. అలాగే శాంతి చర్చలకు ఉన్న అవకాశాలపైనా చర్చించినట్లు చెప్పారు.

కాగా, అంతకు ముందు శనివారం మెలిటొపోల్ సిటీ మేయర్ ను రష్యా బలగాలు కిడ్నాప్ చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు. రష్యన్ సేనల వైఖరి ఐసిస్ ఉగ్రవాదుల చర్యలా ఉందని మండిపడ్డారు. మేయర్ ఇవాన్ ఫెదొరోవ్ ను రష్యన్ బలగాలు తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో ఉక్రెయిన్ అధికారి ఒకరు షేర్ చేశారు. రష్యన్ సైనికులు.. తమ మేయర్ ను అపహరించి యుద్ధ నేరానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మండిపడింది.

మరిన్ని వార్తల కోసం..

శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

చికెన్ బిర్యానీలో పురుగు

జనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే