జనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే

జనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే

 భువ‌నేశ్వర్ : బీజేడీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు బీభత్సం సృష్టించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు. కారు దూసుకురావడంతో ఆగ్రహించిన జనం.. ఎమ్మెల్యేను బయటకు లాగి చితకబాదారు. 

పంచాయతీ సమితి ఛైర్ పర్సన్ ఎన్నికలు జరుగుతుండటంతో బనాపూర్ బ్లాక్  ఆఫీస్ ముందు భారీగా జనం గుమికూడి ఉన్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే ప్రశాంత్ కారుతో వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన జనం ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యేను చితకబాదారు. ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నాడని జనం ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే  ప్రశాంత్కు తంగీ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన ట్రీట్మెంట్ కోసం భువనేశ్వర్ కు తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బీజేడీ పార్టీ గతేడాది సెప్టెంబర్ లో ప్రశాంత్ జగదేవ్ ను సస్పెండ్ చేసింది.