త్వరలో ట్రంప్‌‌తో భేటీ అవుత..న్యూఇయర్‌‌‌‌కి ముందే క్లారిటీ వస్తది: జెలెన్‌‌ స్కీ

త్వరలో ట్రంప్‌‌తో భేటీ అవుత..న్యూఇయర్‌‌‌‌కి ముందే క్లారిటీ వస్తది: జెలెన్‌‌ స్కీ

కీవ్‌‌: నాలుగేండ్లుగా రష్యా, ఉక్రెయిన్‌‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు తాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌‌ ట్రంప్‌‌తో త్వరలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్‌‌ అధ్యక్షుడు జెలెన్‌‌ స్కీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘మేము ఒక్క రోజు కూడా వృధా చేయడం లేదు. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌తో హైలెవల్‌‌ మీటింగ్‌‌ జరపనున్నాం. 

కొత్త సంవత్సరానికి ముందే చాలా విషయాలు ఓ కొలిక్కి రావొచ్చు”అని జెలెన్‌‌ స్కీ పేర్కొన్నారు. కాగా, గురువారం అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌‌ విట్‌‌ కాఫ్‌‌, ట్రంప్ అల్లుడు జారెడ్‌‌ కుష్నర్‌‌‌‌తో చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు.