మార్చి ​1 నుంచి జీరో కరెంట్ ​బిల్లులు : ఎస్ఈ రమేశ్​ బాబు

మార్చి ​1  నుంచి జీరో కరెంట్ ​బిల్లులు : ఎస్ఈ రమేశ్​ బాబు

కామారెడ్డి, వెలుగు: తెల్ల రేషన్​ కార్డు​ఉండి, నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ​వినియోగిస్తున్న వారికి 2024, మార్చి ఒకటో తేదీ నుంచి జీరో బిల్లులు ఇస్తామని ఎన్పీడీసీఎల్​ జిల్లా ఎస్ఈ రమేశ్​బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులై ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనివారెవరైనా ఉంటే.. తమ పరిధిలోని మండల ఆఫీస్, మున్సిపల్​ ఆఫీసుల్లో కరెంట్​కనెక్షన్​ నెంబర్, తెల్లరేషన్​ కార్డ్, ఆధార్​ నెంబర్ ​తదితర వివరాలను సమర్పించాలన్నారు. అర్హత కలిగిన వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

ఉచిత కరెంట్ స్కీం అనేది నిరంతరం కొనసాగుతుందని.. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత సమర్పించినట్లయితే.. అర్హత ఉండినట్లయితే.. వారికి కూడా జీరో కరెంట్ బిల్లు ఇస్తామని స్పష్టం చేశారాయన.