న్యూయార్క్ మేయర్ గా మమ్దానీ ..తొలి ఇండో అమెరికన్ ముస్లింగా రికార్డు

న్యూయార్క్ మేయర్ గా  మమ్దానీ ..తొలి ఇండో అమెరికన్ ముస్లింగా రికార్డు

వాషింగ్టన్: న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మమ్దానీ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లింగానూ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగానూ జోహ్రాన్ మమ్దానీ నిలిచారు. ఆయన తండ్రి మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మమ్దానీ ఉగాండా జాతీయుడు. తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీరానాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కాగా, మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో మమ్దానీకి 50.40 శాతం ఓట్లు (10,36,051) పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. 

ప్రధాన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోకు 41.6 శాతం ఓట్లు (8,54,995) వచ్చాయి. దాదాపు 1.81 లక్షల ఓట్ల మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 7.10% (1,46,137) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 56 ఏండ్లలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాను జోహ్రాన్ చిత్తుగా ఓడించడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలినట్టయింది.

ట్రంప్​కు చురకలు

న్యూయార్క్ ప్రజలు మార్పును కోరుకున్నారని జోహ్రాన్ మమ్దానీ అన్నారు. బ్రూక్లిన్ పారామౌంట్ థియేటర్​లో నిర్వహించిన విక్టరీ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్​ను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్లు చేశారు. ‘‘డొనాల్డ్ ట్రంప్.. మీరు నా విజయాన్ని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి. 

వీలైతే వాల్యూమ్ పెంచి వినండి’’అంటూ ట్రంప్​కు జోహ్రాన్ చురకలు అంటించారు. ‘‘మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు(ట్రంప్) మా అందరినీ దాటాలి. సొంత సిటీలోనే ఓటమి పాలయ్యారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటది. మీ పాలసీలు నచ్చకనే ప్రజలు మిమ్మల్ని ఓడించారు.

 ఈ విజయానికి కారణం న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొత్త తరమే. వారి తరఫున మేమంతా పోరాడుతాం. రాచరిక వ్యవస్థల్ని కూల్చేశాం. న్యూయార్క్ యూత్​కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాలో ఏ ఒక్కరిని టచ్ చేయాలన్నా మా అందర్నీ మీరు(ట్రంప్) ఎదుర్కోవాల్సిందే’’ అని ట్రంప్​పై జోహ్రాన్ విమర్శలు గుప్పించారు. కాగా, 1991 అక్టోబర్​లో ఉగాండా రాజధాని కంపాలాలో జోహ్రాన్ జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. జోహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏడేండ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థిరపడింది.