జొమాటోకు ఐటీ నోటీసులు.. రూ. 23 కోట్ల ట్యాక్స్ పే చేయాలి

జొమాటోకు ఐటీ నోటీసులు.. రూ. 23 కోట్ల ట్యాక్స్ పే చేయాలి

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం జొమాటోకు ఇన్కం టాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు పంపింది. రూ. 23.26 కోట ఆదాయపు పన్ను చెల్లించాలని నోటీసులో తెలిపింది.కర్ణాటక ఇన్కం టాక్స్  అసిస్టెంట్ కమిషనర్ (ఆడిట్) నుంచి జరిమానాతో పాటు మొత్తం  రూ.23. 26 కోట్లు మేరకు ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే జొమాటో ఈ ఆర్డర్ పై అప్పీల్ చేస్తామని చెప్పింది. 

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను GST రిటర్న్ లు, ఖాతాల ఆడిట్  ప్రకారం.. రూ. 11కోట్ల 27లక్షల 23వేల 564 జీఎస్టీ, వడ్డీతో కలిపి మొత్తం జరిమనా రూ. 23కోట్ల 26లక్సల 64వేల 271 చెల్లించాలని నోటీసులు అందాయని BSE రెగ్యులేటరీ ఫైలింగ్ లో జొమాటోతెలిపింది.  

ALSO READ | మారనున్న కొన్ని క్రెడిట్ కార్డ్ రూల్స్‌‌‌‌

ఇటీవల అలీబాబా యాంట్ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన యాంట్ ఫిన్ సింగపూర్ హోల్డింగ్ బుధవారం (మార్చి 27)  జొమాటోలో 2.02 శాతం వాటాను విక్రయించింది. దీని విలువ రూ. 2,827.08కోట్లు. దీంతో వాటి యాజమాన్యం 6.32 శాతం నుంచి 4.3శాతానికి తగ్గింది. అయితే మోర్గాణ్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) .65 శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా జొమాటోలో తన వాటాను పెంచుకుంది.