Zomato : జొమాటోలో 800 ఉద్యోగాల భర్తీ

Zomato : జొమాటోలో 800 ఉద్యోగాల భర్తీ

మాంద్యం కారణంగా బడా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతుంటే.. జొమాటో మాత్రం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి సిద్ధమైంది. జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ లింక్డ్ ఇన్ లో ఈ విషయం ప్రకటించారు. తమ కంపెనీలో వివిధ డిపార్ట్ మెంట్లలో దాదాపు 800 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 

జనరలిస్ట్, గ్రోత్ మేనేజర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీఈఓ, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితర విభాగాల్లో ఉద్యోగుల్ని తీసుకోనున్నారు. అర్హత కలిగిన వాళ్లు [email protected]కు రెస్యూమ్ ను షేర్ చేయాలని చెప్పారు. జొమాటో 2 నెలల క్రితం పనితీరు సరిగా లేదని మొత్తం సిబ్బందిలో 3శాతం మందిపై వేటు వేసింది.