రివ్యూ: జాంబీ రెడ్డి

రివ్యూ: జాంబీ రెడ్డి

రివ్యూ: జాంబీ రెడ్డి
రన్ టైమ్ : 2 గంటల 4 నిమిషాలు
నటీనటులు: తేజ సజ్జ, ఆనంది, దీక్ష, గెటప్ శీను, హేమంత్, కిరీటీ తదితరులు
మ్యూజిక్ : మర్క్ .కె.రాబిన్
సినిమాటోగ్రఫీ: అనిత్
నిర్మాత: రాజశేఖర్ వర్మ
రచన,దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 5,2021

కథేంటి?

మారియో (తేజ)  గేమ్ డిజైనర్.ఓ గేమ్ తయారు చేసిన తర్వాత దాని కోడింగ్ సరిగా రాకపోవడంతో అది సరిచేసుకునేందుకు తన ఫ్రెండ్ ఊరికి బయలు దేరతాడు. కానీ మధ్యలో ఓ సంఘటన వల్ల తన ఫ్రెండ్ జాంబీగా మారతాడు. ఊరెళ్లిన తర్వాత అందరూ జాంబీల్లాగా బిహేవ్ చేస్తుంటారు. ఇంతకీ వాళ్లు ఎందుకు అలా మారతారు.?వాళ్ల కు ఏమైంది? చివరకు హీరో వాళ్లను మళ్లీ మాములు మనుషులుగా ఎలా చేసాడన్నదే స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ హీరో మెటీరియల్ ఏం కాదు కానీ. నటనలో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ ఆనంది బాగుంది. అందంతో పాటు మంచి అభినయం కనబరిచింది. దీక్ష నటనలో వీక్. గెటప్ శీను కామెడీ అక్కడక్కడా బాగా పేలింది. హేమంత్, కిరీటీ, వినయ్ వర్మ, హరితేజ వాళ్ల పరిధిమేర నటించి మెప్పించారు.

టెక్నికల్ వర్క్:

అనిత్ సినిమటోగ్రఫీ బాగుంది. మర్క్ రాబిన్ మ్యూజిక్ బాగుంది కానీ లౌడ్ గా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రణగొణ ధ్వనులతో నింపేసాడు. ఆర్ట్ వర్క్, యాక్షన్ పార్ట్ అన్ని బాగా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ప్రశాంత్ వర్మ రాసిన డైలాగులు కొన్ని బాగున్నాయి.

విశ్లేషణ:

డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ తన మూడో సినిమాగా జాంబీ కథను ఎంచుకున్నాడు. తెలుగులో కొత్తే అయినా కానీ అది ఎఫెక్టివ్ గా తీయలేకపోయాడు డైరెక్టర్. కరోనా అనేదాన్ని ఇరికించినట్టు అనిపించింది. ఈ జాంబీ కథకు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ యే సరిగా లేదు. కామెడీ కోసం ఫ్యాక్షన్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. అందువల్ల అటు థ్రిల్లర్ గా లేక ఇటు కామెడీ పండక మిస్ ఫైర్ అయింది. ఫస్టాఫ్ అంతా కథలోకి తొందరగా వెళ్లకుండా విసిగిస్తారు. సెకండాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు పండి బాగా వెళ్తుందనుకున్న టైమ్ లో క్లైమాక్స్ లో మళ్లీ నీరు గార్చేశారు. ఎఫెక్టివ్ గా ఉండాల్సిన క్లైమాక్స్ ను సింపుల్ గా ముగించారు. ప్రెడిక్టబుల్ గా ఉన్న ఈ కథను మంచి స్క్రీన్ ప్లేతో రక్తి కట్టించవచ్చు కానీ డైరక్టర్ ప్రశాంత్ వర్మ తన రైటింగ్ లో పెద్దగా మెరుపులు మెరిపించకుండా చప్పగా ముగుంచేశాడు. ఓవరాల్ గా జాంబీ రెడ్డి ఆశించినంత ఆకట్టుకోడు.

బాటమ్ లైన్: కష్టం రెడ్డి…