ZPTC,MPTC ఎన్నికల్లో…ఏకగ్రీవాలు తక్కువే

ZPTC,MPTC ఎన్నికల్లో…ఏకగ్రీవాలు తక్కువే

ZPTC,MPTC మొదటి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నా మినేషన్ల ఉప సంహరణ ఆదివారంతోముగిసింది. మే 6న పోలిం గ్ జరగనుంది. బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిం ది. మొదటి దశలో పోలిం గ్ జరగనున్న 197 జడ్పీటీసీలకు 902 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశకు నా మినేషన్ల ప్రక్రియ కొ నసాగుతోంది. అయితే ఎక్కడా ఏకగ్రీవాలు కా నరాని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా మూడు దశల్లో జరగ్గా.. ప్రతి దశలోనూ వందల సంఖ్యలో గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో మూడింట రెం డొంతుల ఏకగ్రీవాలు టీఆర్ ఎస్ మద్దతుదారులవే ఉన్నాయి. కానీ మూడు నెలల తర్వాత జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితు లు మారిపోయాయి. కేవలం ఒక జడ్పీటీసీ, రెండు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఏకగ్రీవం కావడం గమనార్హం.

భారీగా నామినేషన్లు….

రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ ఎన్నికలు జరుగుతున్న 197 జడ్పీటీసీలకు 2,104 , 2,166 ఎంపీటీసీలకు 15,036 నా మినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణ తర్వా త కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. 197 డ్పీటీసీలకు మొత్తం 902 మంది బరిలో ఉన్నారు. అంటే ఒక్కో జడ్పీటీసీకి సుమారు ఐదుగురు పోటీ పడుతున్నారు. ఒక్కో ఎంపీటీసీ స్ థా నాని కి ఏడుగురు పోటీ పడుతున్నారు. రెండోదశకు నా మినేషన్ల దాఖలు గడువు ము గిసింది. ఈ దశలోని 180 జడ్పీటీసీలు, 1,913 ఎంపీటీసీలకు మే 10న పోలింగ్ జరగనుంది.

మూడు చోట్ల…

మొదటి దశ నా మినేషన్ల ఉప సంహరణ తరువాత చాలా సంఖ్యలో నా మినేషన్లను వె నక్కి తీసుకోవటం,అధికారులు తిరస్కరించటం జరిగాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఎంపీటీసీ సీట్లో , మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట ఎంపీటీసీ స్థానంలో ఒకే నామినేషన్ మిగలడంతో ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ జడ్పీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఇక్క బరిలో ఉన్న కాంగ్రెస్, బీ జేపీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

కలెక్టర్ ఒకే చెప్పాకే…

ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఈసీ గైడ్ లైన్స్ విడుదల చేసింది. నా మినేషన్ల ఉప సంహరణ తరువాత ఒకేనామినేషన్ మిగిలితే.. కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ ఆఫీసర్లను ఆదేశించింది. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు జరగలేదని జిల్లా కలెక్టర్ ధ్రువీకరించిన తర్వా తే విజేతను ప్రకటించాలని స్పష్టం చేసింది. ఎవరైనా బెదిరింపులకు, ప్రలోభాలకు దిగినా, వేలం పాటల వంటివి నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

భారీగా స్వతంత్ర అభ్యర్థులు…

అధికార టీఆర్ ఎస్ తోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచీ భారీగా రెబల్ అభ్యర్థులు పోటీలోకి దిగుతున్నారు. మండలాలు, జిల్లాలు పెరగటంతో రిజర్వే షన్లు, ఇతర సమీకరణాలు అనుకూలిస్తే ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లు, వైస్ చైర్మన్లు కావొచ్చని ఆశిస్తున్నారు. తొలిదశ ఎలక్షన్లలో ఎంపీటీసీకి 2,712 మంది, జడ్పీటీసీకి 301 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నా మినేషన్లు వేశారు. అందులో చాలా వరకు ప్రధాన పార్టీల రెబల్స్ ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని ఓ జడ్పీటీసీ సీటుకు 107 నా మినేషన్లు వచ్చాయి. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం జడ్పీటీసీ స్ థా నంలో అధికార పార్టీ తమ నేతకు టికెట్ ఇవ్వలే దన్న ఆగ్రహంతో ఆయన అనుచరులు ఇలా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పలువురు ముఖ్యనేతలు సదరు టికెట్ దక్కని నేతతో చర్చలు జరిపి, నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. దాంతో చివరి రోజున ఆయన అనుచరులు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. అక్కడ 10 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.

కొత్త, పాత నేతల మధ్య విభేదాలు….

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నుంచి 11 మంది, టీడీపీ నుం చి ఒక ఎమ్మె ల్యే, మరో ఇండింపెం డెంట్ ఎమ్మె ల్యే, ఫార్వర్డ్ బ్లా క్ ఎమ్మె ల్యే అధికార పార్టీలో చేరారు. వారి వెంట కిం దిస్థాయి నేతలూ వచ్చారు. అయితే ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపి క బాధ్యతను ఎమ్మె ల్యేలకే అప్పగిస్తూ సీఎం ని ర్ణయం తీసుకున్నారు. కొత్త ఎమ్మెల్యేలు తమ అనుచరులకే జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ ఇస్తున్నారు. దీంతో పాత, కొ త్త నేతల మధ్య వి వాదాలు మొదలయ్యాయి. పలువురు టీఆర్ ఎస్ , కాంగ్రెస్ నేతలు రెబల్ గా నా మినేషన్లు దాఖలు చేశారు. ఎన్నో ఏళ్ల నుం చి పార్టీ కోసం పనిచేస్తుంటే టికెట్ ఇవ్వలే దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటములపై వారి ప్రభావం ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు.