జైడస్ నుంచి ఫ్లూ వ్యాక్సిన్

జైడస్ నుంచి ఫ్లూ వ్యాక్సిన్

న్యూఢిల్లీ:  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌ఓ) సిఫార్సులకు అనుగుణంగా తమ ట్రివాలెంట్ ఇన్​ఫ్లూయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్ ‘వాక్సిఫ్లూ’ను భారతదేశంలో విడుదల చేసినట్లు జైడస్ లైఫ్‌‌సైన్సెస్ లిమిటెడ్ మంగళవారం తెలిపింది. ఈ వ్యాక్సిన్ 6 నెలలు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇస్తారు.  డబ్ల్యూహెచ్‌‌ఓ సర్వే ఆధారంగా ఎంపిక చేసిన అప్‌‌డేటెడ్ స్ట్రెయిన్లు ఈ వ్యాక్సిన్​లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. 

ఇది ఫ్లూ నుంచి కాపాడుతుందని పేర్కొంది. వ్యాక్సిన్‌‌లు వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగమని జైడస్ లైఫ్‌‌సైన్సెస్ ఎండీ, సీఈఓ శర్విల్ పటేల్ అన్నారు. ఈ వ్యాక్సిన్ వ్యాధిని నివారించగలదని, సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఫ్లూ ఒక అంటువ్యాధి. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీనివల్ల ఏటా 6.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా.