
ఒకే ఒక్క క్యారెక్టర్‌తో సింగిల్ షాట్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘105 మినిట్స్’. హన్సిక లీడ్ రోల్ చేస్తోంది. రాజు దుస్సా డైరెక్షన్‌లో బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. రాజేంద్రనగర్ దగ్గర్లోని ఓ ఇంట్లో షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న హన్సిక పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ బాబి చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. పగిలిన అద్దంలో నుంచి హన్సిక కనిపిస్తోంది. ఒళ్లంతా గాయాలు.. చేతులకు, కాళ్లకు సంకెళ్లు.. చాలా టెన్షన్‌లోను, భయంతోను ఉంది. తన లుక్ మూవీపై ఆసక్తిని కలిగించింది. దీంతోపాటు ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ అనే సినిమాలోనూ నటిస్తోంది హన్సిక.