ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి

ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి

రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘స్వాగతాంజలి’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో రాజనర్తకి చంద్రముఖి గెటప్‌‌‌‌లో డాన్స్ చేస్తూ కనిపిస్తోంది కంగనా. ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి.. పదము పదముగా, హృదయ లయలుగా.. ప్రకృతి పురుషులే పరవశించగా.. ప్రణవం వినుతించిన నాట్యం.. నయన మధురమై నటన సదనమై నరనరాలలో నాద భరితమై’ అంటూ సాగే ఈ పాటను ఆస్కార్ విజేత కీరవాణి కంపోజ్ చేశారు.

ట్యూన్‌‌‌‌తో పాటు.. శ్రీనిధి తిరుమల పాడిన తీరు ఆకట్టుకుంది.  ‘సఖుడా.. నీపై ధ్యాస.. నా యద ఘోష.. తకతక తరికిటత.. తకిట తకిట తాళము సాగిన ఊసుల గుస గుస’ అంటూ చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి. ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్‌‌‌‌గా రూపొందుతున్న ఈ మూవీలో వ‌‌‌‌డివేలు, ల‌‌‌‌క్ష్మీ మీన‌‌‌‌న్‌‌‌‌, మ‌‌‌‌హిమా నంబియార్‌‌‌‌, రాధికా శ‌‌‌‌ర‌‌‌‌త్ కుమార్‌‌‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.