నాణ్యమైన ఆహారం తీసుకోవడంతో మెరుగైన జీవనం సాధ్యమవుతుందని పలువురు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈట్రైట్వాక్ మారథన్ప్రోగ్రాంను నిర్వహించారు. ములుగు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద, జనగామలో, వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ర్యాలీని ఆయా జిల్లాల కలెక్టర్లు దివాకర, సందీప్ కుమార్ ఝా, సత్యశారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో రవిరాథోడ్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. - ములుగు/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ/ మహబూబాబాద్/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు
