ఇంగ్లీష్ మీడియం.. సెవెన్త్ వరకే!

ఇంగ్లీష్ మీడియం.. సెవెన్త్ వరకే!
  • వచ్చే ఏడాది సర్కారు బడుల్లో స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసే యోచన
  • ప్రతియేడు ఒక్కో క్లాస్ పెంచుతూ పోయేలా ప్లాన్ 
  • ఒకేసారి అన్ని బడుల్లో కష్టమే అంటున్న ఆఫీసర్లు 
  • మెజార్టీ హైస్కూల్స్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం 
  • గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ తయారీలో విద్యాశాఖ అధికారులు 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో వచ్చే ఏడాది స్టార్ట్ చేసే ఇంగ్లీష్ మీడియం క్లాసులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని బడుల్లో ఒకేసారి టెన్త్ వరకూ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌ మీడియం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని ప్రకటించినా, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అన్ని ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్​ను, హైస్కూల్స్‌‌‌‌‌‌‌‌లో ఏడో తరగతి వరకు వచ్చే ఏడాది ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. అయితే భాషాభిమానుల నుంచి వ్యతిరేకత రాకుండా, కోర్టుల నుంచి ఇబ్బందులు లేకుండా గైడ్స్‌‌‌‌‌‌‌‌లైన్స్ తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 26,072 సర్కారు స్కూల్స్​ ఉండగా, వాటిలో 22.93 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీటిలో 10.21 లక్షల మంది చదువుతున్న 10,704 బడుల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 10,600 ప్రైవేటు స్కూల్స్​లో 95% వరకు ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు బోధిస్తారు. వీటిలో 30 లక్షల మందికిపైగా స్టూడెంట్లు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీల్లో ఉండే పేరెంట్స్ వరకూ అందరూ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌ మీడియం స్కూల్స్‌‌‌‌‌‌‌‌నే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తామని ప్రభుత్వం పదిరోజుల క్రితం ప్రకటించింది. దీనికి కేబినేట్ కూడా ఆమోదం తెలిపిందని చెప్పింది. ఇంగ్లీష్​ మీడియంలో క్లాసులు చెప్పే ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ టీచర్లకు లేకుండా ఒకేసారి టెన్త్ వరకు ప్రారంభిస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఉమ్మడి ఏపీలో 2008–09 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్​రెడ్డి సక్సెస్ స్కూళ్ల పేరుతో 6,500 హైస్కూల్స్​లో ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రారంభించారు. అయితే, ముందుగా 6వ తరగతి స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఒక్కో క్లాసును పెంచుతూపోయారు. అప్పట్లో 13 రోజులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ ఇచ్చి, పాఠాలు చెప్పించారు. దీంతో పాఠాలు చెప్పడానికి టీచర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకేసారి అన్ని స్కూల్స్​లోనూ ఒకేసారి ఇంగ్లీష్ మీడియం క్లాసులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తే, ఇవే సమస్యలు మళ్లీ వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని టీచర్లు చెప్తున్నారు. 

పీఎస్, యూపీఎస్ అన్నింటిలో..
వచ్చే ఏడాది అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్​లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం పాఠాలు కూడా చెప్పించాలని అధికారులు భావిస్తున్నారు. హైస్కూల్స్​లో 6, 7 క్లాసులకు ఇంగ్లీష్ మీడియం తరగతులు కొనసాగించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం18 వేల ప్రైమరీ స్కూళ్లలో 6,226 స్కూళ్లు, 3,151 యూపీఎస్‌‌‌‌‌‌‌‌ల్లో 1,536 స్కూళ్లు, 4,688 హైస్కూళ్లలో 2,942 స్కూల్స్​లో ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసులు చెబుతున్నారు. సర్కారు ఆదేశాలతో వచ్చే ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్​లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఏపీలోనూ ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలని అనుకున్న అక్కడి సర్కారు, హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. పేరెంట్స్ అనుమతితోనే స్టూడెంట్లకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో కూడా అలాంటి సమస్య రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. న్యాయ సలహాలూ తీసుకుంటున్నారు. ఇంగ్లీష్​ మీడియం బడులపై త్వరలోనే సర్కారు అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది. 

సగం టీచర్లు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నరు..
రాష్ట్రంలో మొత్తం 1.03 లక్షల మంది టీచర్లుండగా, ప్రస్తుతం 60 వేల మంది టీచర్లు తెలుగు,ఇంగ్లీష్ మీడియం కొనసాగే బడుల్లో పనిచేస్తున్నారు. వీరంతా దాదాపు ఆయా బడుల్లో ఇంగ్లీష్​ మీడియంలోనే పాఠాలు చెప్తున్నారు. తెలుగు మీడియం పాఠాలు చెప్పే వారిలో ఎస్జీటీలే ఎక్కువ మంది ఉండగా, హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువ మంది క్లాసులు బోధిస్తున్నారు. 23 వేల మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లలో 27 వేల మంది, పీఈటీ, పీడీలు 2 వేల మంది, 5 వేల మంది లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ పండిట్లు ఇంగ్లీష్​లోనే పాఠాలు చెప్తున్నారు. మిగిలిన వారందరికీ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పలు స్వచ్చంద సంస్థలతో క్లాసులు చెప్పిస్తున్నారు. ఇంగ్లీష్​ మీడియం బడుల ప్రకటన తర్వాత టీచర్లందరికీ విడతల వారీగా ట్రైనింగ్​కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్కారు నిర్ణయంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరుగుతాయని ప్రభుత్వ పెద్దలు, ఆఫీసర్లు భావిస్తున్నారు. 

రాష్ట్రంలో టీచర్ల వివరాలు 
స్కూల్స్     మొత్తం టీచర్లు    ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లు 
ప్రైమరీ స్కూళ్లు (18,233)    41,828    18,502 
యూపీఎస్  (3,151)    15,638    8,416 
హైస్కూల్స్ (4,688)    46,445    33,686 
మొత్తం    1,03,911    60,604