ఇది మోసపూరిత బడ్జెట్

ఇది మోసపూరిత బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్తో సాధారణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు.ద్రవ్యోల్బణం, నిరుద్యోగికతతో కొట్టుమిట్టాడుతన్న ప్రజలు, యువతకు ఈ బడ్జెట్తో కలిగే ప్రయోజనం సున్నా అని ఆమె ట్వీట్ చేశారు. పద్దులో పెద్ద పెద్ద పదాలను సూచించడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.

మోడీ ప్రభుత్వం ఎప్పుడూ భ్రమలతో కూడిన మోసగించే బడ్జెట్ నే ప్రవేశ పెడుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఈసారి కూడా బడ్జెట్ లో  సాధారణ ప్రజలకు కోసం చేసిందేమీ లేదన్నారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా ఎలా మారతారో అతి త్వరలో మనం చూడబోతున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ బడ్జెట్ తో పేదలు, మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహల్ గాంధీ కామెంట్ చేశారు. బడ్జెట్ లో వేతన జీవులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, రైతులకు చేసిందేమీ లేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం గుడ్న్యూస్

అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్

ఫిట్నెస్ మెరుగుపర్చుకోకుంటే హిట్మ్యాన్కు కష్టం