నెలరాజే యువరాజై.. ‘ద్రౌపది 2’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

నెలరాజే యువరాజై.. ‘ద్రౌపది 2’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ జంటగా  మోహన్ జి దర్శకత్వంలో  సోల చక్రవర్తి నిర్మిస్తున్న  చిత్రం ‘ద్రౌపది 2’. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్.  ‘నెల‌‌‌‌రాజే..’ అంటూ  అమ్మాయి కాబోయే వరుడిని  మ‌‌‌‌న‌‌‌‌సులో ఊహించుకుంటూ సాగే  పాట ఇది.  

జిబ్రాన్ కంపోజ్ చేయగా,  సామ్రాట్ లిరిక్స్ రాశాడు.  ప‌‌‌‌ద్మల‌‌‌‌త పాడారు. ‘నెలరాజే యువరాజై.. వరమల్లే వరుడయ్యే.. క్షణ క్షణము పరవశమేగా..’ అంటూ సాగిన పాట ఆకట్టుకుంది.   ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు.  ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్ సుందర్ కెమెరామెన్‌‌‌‌గా, దేవరాజ్ ఎస్ ఎడిటర్‌‌‌‌గా, ఎస్ కే ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌గా పని చేస్తున్నారు.